Header Banner

అమరావతికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చంద్రబాబు! కేంద్రం మద్దతుతో అమరావతి కల సాకారం!

  Wed Mar 12, 2025 15:33        Politics

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్రం సైతం అమరావతి కి ఆర్ది కంగా తోడ్పాటు అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 13 వేల కోట్ల రుణం మంజూరు కాగా, కేంద్రం రూ 1500 గ్రాంట్ గా ఆమోదించింది. అమరావతిలో తిరిగి పనులు ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అమరావతికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
రాజధానికి ప్రధాని
2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. ఆ తరువాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకు రావటంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్దిక వనరుల సమీకరణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ బ్యాంకు - ఏడీబీ నుంచి రూ 13 వేల కోట్ల మేర రుణం అమరావతికి మంజూరు అయింది. అదే విధంగా ఇతర ఆర్దిక సంస్థల నుంచి రుణాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనుల ప్రారంభానికి టెండర్లు ఆహ్వానించారు.


ఇది కూడా చదవండినిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..


అమరావతి వేదికగా
ఇదే సమయంలో అమరావతి పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పనులు తిరిగి ప్రారంభ వేడుకను గణంగా నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. ఏప్రిల్ లో ఈ మేరకు వేడుకలా నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధానితో చర్చల సమయంలో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించగా.. అంగీకరించినట్లు సమాచారం. తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతి లో రూ రూ.64,721 కోట్ల ఖర్చుతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ 2028కి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అదే విధంగా భూ కేటాయింపుల పైన ప్రభు ప్రత్యేకంగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. భూములు కేటాయించిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది.


ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో రూ 11 వేల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తాజాగా రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. రూ. 37,702 కోట్ల పనులకు సంబంధించి 59 టెండర్లను సీఆర్​డీఏ ఆమోదం తెలిపింది. అన్ని పనుల్నీ దాదాపు ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా నిర్వహించాలని భావిస్తోంది. పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు వేగంగా జరిగేలా కసరత్తు చేస్తున్నారు. 2028 నాటికి లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఇక, ప్రధాని రావటం ద్వారా అమరావతి వైపు దేశం మొత్తం ఇటు చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన ముహూర్తం ఒకటి, రెండు రోజుల్లో ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!


టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!



అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #amaravathi #modi #APCM #CBN #todaynews #flashnews #latestnews